Breaking News

Daily Archives: March 27, 2021

విశ్వబ్రాహ్మణ సంఘం మండల‌, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలోని శివగల్లీలో విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో శనివారం భీమ్‌గల్‌ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు అందరు కూడా తమ ఐక్యత చాటడం కోసం శనివారం తమ విశ్వబ్రాహ్మణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ఉదయం 8:30 గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు కొనసాగింది. ఇందులో భీమ్‌గల్‌ మరియు బింగల్‌ మండలం క్రింద ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొన్నారు.

Read More »

అయ్యప్పస్వామికి విశేష పూజలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ శ్రీ అయ్యప్పస్వామి మందిరంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త శ్రీ అయ్యప్ప స్వామి పుట్టిన రోజు 28వ తేదీ ఆదివారం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల‌కు స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడతాయని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు. కావున భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల‌రని కోరారు.

Read More »

ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నందున గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల‌లో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి మార్చ్‌ ముగిసేలోగా పూర్తిగా పన్ను వసూలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపిడిఓలు, ఏపిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు, పంచాయతి రాజ్ ఏఈలు, మున్సిపల్‌ కమీషనర్ల‌‌తో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నలుగురు కమీషనర్‌లు ...

Read More »

టి.బి. నివారణలో జాతీయస్థాయి అవార్డు

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి బి నివారణలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని, ఇందుకు పని చేసిన క్షేత్ర స్థాయి సిబ్బందిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల‌ 24న ప్రపంచ టి.బి. నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా ఆసుపత్రి లో నేషనల్‌ టిబి ఎలిమినేషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రాంభించారు.   ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామరెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల‌కు చెందిన 202 మందికి ల‌బ్దిదారుల‌కు 2 కోట్ల 2 ల‌క్షల‌ 23 వేయిల‌ 432 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 ల‌క్షల‌ 2 వేల‌ 332 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది మూభారక్‌ చెక్కులు ...

Read More »

బంద్‌తో బోధకులు రోడ్డున పడ్డారు…

ఆర్మూర్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన పేరుతో విద్యా సంస్థల్ని మూసివేయడాన్ని పిడిఎస్‌యు తీవ్రంగా ఖండించింది. ప్రగతిశీల‌ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డిఓకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోన పేరుతోనే విద్యాసంస్థలు మూసివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమాహాళ్లు, బార్లకు, హోటళ్లకు లేని కరోనా విద్యాసంస్థల‌కు ఏంది అని ప్రశ్నించారు. కేవలం ఎల‌క్షన్ల కోసమే విద్యాసంస్థల‌ను తెరిచి తర్వాత ...

Read More »

నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు, బోధన్‌ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల‌ సమక్షంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాల‌యంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో విజేతలు… 1. బండి దయానంద్‌ : టోకెన్‌ నెంబర్‌ 3 2. కె.సతీష్‌ : టోకెన్‌ నెంబర్‌ 9 3. బి.రాజు ...

Read More »