బంద్‌తో బోధకులు రోడ్డున పడ్డారు…

ఆర్మూర్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన పేరుతో విద్యా సంస్థల్ని మూసివేయడాన్ని పిడిఎస్‌యు తీవ్రంగా ఖండించింది. ప్రగతిశీల‌ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డిఓకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోన పేరుతోనే విద్యాసంస్థలు మూసివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

సినిమాహాళ్లు, బార్లకు, హోటళ్లకు లేని కరోనా విద్యాసంస్థల‌కు ఏంది అని ప్రశ్నించారు. కేవలం ఎల‌క్షన్ల కోసమే విద్యాసంస్థల‌ను తెరిచి తర్వాత మూసి వేయడం సరైన పద్ధతి కాదని, దీని మూలంగా ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లు రోడ్డున పడ్డారని, ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాల‌ని నరేందర్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిస్తామన్నారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు ఆర్మూర్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌ దుర్గాప్రసాద్‌, ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షుడు ఎల్‌ అనిల్‌, ఉపాధ్యక్షుడు సాయి కుమార్‌, నాయకులు ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Check Also

త్వరలో జల‌కళ…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం కాలేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ వద్ద ...

Comment on the article