Breaking News

1న గో మహాగర్జన విజయవంతం చేయండి

బీర్కూర్‌, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ ఒకటో తేదీన భాగ్యనగరం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించ తల‌పెట్టిన గో మహాగర్జన బహిరంగ సభ విజయవంతం చేయాల‌ని హనుమాన్‌ దీక్ష మాల‌ ధరించిన గురు స్వాములు సూచించారు. ఆదివారం నస్రుల్లాబాద్‌ మండలం మిర్జాపూర్‌ గ్రామంలో నిర్వహించిన హనుమాన్‌ దీక్ష మాల‌ ధారణ స్వాముల‌ మండల‌ బిక్ష మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు.

గో మహాగర్జన బహిరంగ సభ ప్రాముఖ్యతను వివరించి మాల‌ ధరించిన స్వాములందరూ ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల‌ని, పీఠం గురు స్వాముల‌ను మరియు మాల‌ ధరించిన దీక్ష స్వాముల‌ను పాదాభివందనాలు చేసి వేడుకున్నారు.

అనంతరం మిర్జాపూర్‌ పీఠం గురు స్వామి పోతునూరి అశోక్‌ కుమార్‌ గుప్తా ఆర్టీసీ డ్రైవర్‌ ఆర్థిక సౌజన్యంతో స్వాముల‌కు బిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నసురుల్లాబాదు, బీర్కూర్‌ మండలాల‌లోని ఆయా గ్రామాల‌ దీక్ష స్వాములు గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు.

11 వాహనాల‌లో 80 మంది స్వాములు బయలుదేరి వెళ్లనున్నట్లు గురు స్వాములు నసురుల్లాబాదు సాయ గౌడ్‌, అంజలి పూర్‌ రాజు, నారాగౌడ్‌, సాయగౌడ్‌ తెలిపారు.

Check Also

లింబాద్రిలో భక్తుల‌ రద్దీ

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల‌ ...

Comment on the article