Breaking News

మాస్కు లేకుంటే జరిమానాలు తప్పవు – ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని మోర్తాడ్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలందరూ మాస్కు లేకుండా బయట తిరగవద్దు అని మోర్తాడ్‌ ఎస్సై సురేష్‌ కుమార్‌ తెలిపారు. మాస్కు లేకుండా తిరగడం నేరమని అందుకు తగిన జరిమాన విధించబడుతుందని ఎస్సై పేర్కొన్నారు.

కోవీడు 19 ముందస్తు చర్యల్లో భాగంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని దీన్ని ప్రజలెవరూ తిరస్కరించవద్దని తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని ఎస్‌ఐ అన్నారు.

ప్రజలు ఎవ్వరు గుంపులుగుంపులుగా తిరగవద్దు అని గుంపులు గుంపులుగా కూర్చోవద్దని సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌న్నారు. పండగలు పబ్బాల‌ సమయంలో ప్రజలు గుమిగూడి ఉండరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించి కోవిడ్‌ 19 ను అదుపు చేయడానికి సహకరించాల‌ని కోరారు. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు అయితే వారికి జరిమానాలు తప్పవని ఆయన వివరించారు.

Check Also

జర్నలిస్టుల‌ను ఆదుకోండి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నేటి వరకు కరోనాకు బలి అయి ...

Comment on the article