Breaking News

అభివృద్ధికి పెద్దపీట

నిజాంసాగర్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌ మండల‌ కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వైకుంఠదామాన్ని జుక్కల్‌ ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే గ్రామాల‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు. 70 సంవత్సరాల పాల‌నలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌ రెడ్డి, సొసైటి చైర్మెన్‌ హన్మంత్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, ఎంపివో సూర్య కాంత్‌, స్థానిక సర్పంచ్‌ తిరుమల‌ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, నాయకులు విజయ్‌ దేశాయ్‌, తదితరులున్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article