Breaking News

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల‌ ద్వారా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజమైన రైతు పక్షపాతి అన్నారు. రైతుకు అన్ని విదాలుగా అండదండలు అందిస్తున్న కేసీఆర్‌కి రైతులు, ప్యాక్స్‌ చైర్మన్ల తరుపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కుఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, సహకార బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, బ్యాంక్‌ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article