Breaking News

సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌ గ్రామ శివారులో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభావేదిక, హెలిప్యాడ్‌ స్థలం పనుల‌ను జుక్కల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభావేదిక పనుల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల‌ సర్పంచ్ల‌‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, నాయకులు పిట్ల సత్యనారాయణ, రమేష్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article