Breaking News

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గత వారం రోజుల‌ నుండి జరుగుతున్న శ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల‌లో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఎరుగట్ల మండలాల‌లోని ఆయా గ్రామాల‌ నుండి అనేకమంది భక్తులు పాల్గొని విజయ విజయవంతం చేశారు.

బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా మంగళవారం రాత్రి 12 గంటల‌ తర్వాత రథయాత్ర నిర్వహించారు. రథయాత్రలో అనేక గ్రామాల‌ భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు బుధవారం తెల్ల‌వారుజామున చక్రతీర్థంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ భారీ బందోబస్తు నిర్వహించారు.

Check Also

మోర్తాడ్‌లో కుంటను మింగిన పెద్దలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పంట పొలాల‌కు సాగునీరు అందించే ...

Comment on the article