Breaking News

కోవిడ్‌ వ్యాక్సిన్‌ గోడప్రతుల‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ తప్పకుండా వ్యాక్సిన్‌ అందించాల‌నే ఉద్దేశంతో విస్తృత ప్రచారంలో భాగంగా కోవిడ్‌-19 టీకా యొక్క పోస్టర్‌ని బీజేపీ సీనియర్‌ నాయకులు లోక భూపతి రెడ్డి చేతుల‌ మీదుగా ఆర్మూర్‌ పీవీఆర్‌ భవన్‌లో బుధవారం ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు నూతుల‌ శ్రీనివాస్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌, కోవిడ్‌ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ ద్యగ ఉదయ్‌, జిల్లా బీజేవైయమ్‌ ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేపీ నాయకులు న‌ల్ల‌ రాజారామ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article