Breaking News

Monthly Archives: April 2021

గురువారం నాటి ఘటనపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ అని చెప్పి సెలైన్‌ వాటర్‌ ఉంచిన బాటిల్స్‌ అమ్మడం, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఈ ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్మడం ఘటనను యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఇందుకు పాల్ప‌డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల‌తో ఈ విషయాల‌పై సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కరోనా వల‌న ప్రజలు రకరకాలుగా ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల ...

Read More »

పోలీసువారి హెచ్చరిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ రెమిడెసివియర్‌ ఇంజక్షన్‌ కరోనా రోగుల‌కు విక్రయించిన ఇద్దరు వ్యక్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాడిన రెమిడెసివియర్‌ సీసాలో సిలేన్‌ వాటర్‌ పోసి కరోనా రోగుల‌కు విక్రయించి మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి రినూండ్‌కు తరలించడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధిక ధరల‌కు (1 ఇంజక్షన్‌ ...

Read More »

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశించినట్లు కామారెడ్డి ఆర్‌టివో వాణి ఒక ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్‌ డ్రైవర్లు కోవిడ్‌ రోగుల‌ బంధువుల‌ వద్ద అధిక రుసుము వసూలు చేస్తే సెల్‌ నెంబర్‌ 9959106776 కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాల‌ని ఆమె కోరారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక సొమ్ము వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ...

Read More »

డాక్టర్లు కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అలాగే జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పరిధిలోని ఆయా పిహెచ్‌సిల‌లో కోవిడ్‌ 19 ఐసోలేషన్‌ వార్డులలో పనిచేయడానికి మూడునెల‌ల కొరకు కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు అర్హులైన వైద్యులు కావాల‌ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిఏఎస్‌ అనస్తియస్ట్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జనరల్‌ మెడిసిన్‌ ఒక పోస్టు, సిఏఎస్‌ జిడిఎంవో ఒక పోస్టు జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో అవకాశముందన్నారు. అలాగే పిహెచ్‌సిలో సిఏఎస్‌ ...

Read More »

మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని బి.ఎడ్‌. కోర్సుల‌కు చెందిన మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ పరీక్షలు జనవరి, 2021 లో జరిగిన విషయం తెలిసిందే. అందుకు గాను బి.ఎడ్‌. పరీక్షల‌ సమాధాన పత్రాల‌కు మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహింపబడుతుందని వర్సీటి అధికారులు వెల్ల‌డించారు. రీ వాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి రూ. 500, రీ కౌంటింగ్‌ పేపర్‌ ఒక్కింటికి రూ. 300, దరఖాస్తు ఫారానికి ...

Read More »

పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లు

బోధన్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లో వార్డ్‌ నెంబర్‌ 18 శ్రీనివాస్‌ నగర్‌ కాంప్‌, ధ్యాకం గల్లీలో ఈనెల‌ 30 న జరిగే మున్సిపాలిటి బై ఎల‌క్షన్‌ పోలింగ్‌ కేంద్రాల‌ వద్ద మరియు రాకాసి పేట్‌ వద్ద గల‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద తీసుకోవల‌సిన పటిష్ట బందోబస్తు మరియు భద్రత చర్యల‌ గురించి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. అనంతరం తీసుకోవల‌సిన జాగ్రత్తల‌ గురించి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. సిపి వెంట ...

Read More »

కనికరించని కరోనా – పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పెరిగిపోతుంది. దీనివ‌ల్ల‌ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. గ్రామాల్లో కరోనా వైరస్‌ సోకిన వారు మరణిస్తూ ఉంటే కొందరేమో వైరస్‌ సోకుతుందేమోనని భయంతోనే మరణిస్తున్నారని మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ అన్నారు. కరోనా వైరస్‌కు ప్రజలు ఎవ్వరు భయపడవద్దని, డాక్టర్లు చెప్పిన విధంగా మాస్కులు ధరించి, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాల‌ని సూచించారు. ప్రజలు ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని ...

Read More »

కరోనాతో వీఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తహసిల్‌ కార్యాల‌యంలో గత కొన్ని సంవత్సరాల‌ నుండి విఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్న దని సాయన్న మండలంలోని గాండ్లపేట గ్రామ వాస్తవ్యుడు. కాగా సాయన్నకు కోవిడ్‌ సోకడంతో నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మరణించినట్లు మోర్తాడ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత తెలిపారు. సాయన్న మోర్తాడ్‌ మండలంలో గత 30 సంవత్సరాల‌ పైబడి పనిచేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. సాయన్న మృతితో మోర్తాడ్‌ మండలంలోని ఆయాగ్రామాల‌ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న సేవల‌ను ...

Read More »

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల‌కు శ్రద్ధాంజలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షు గుమ్మడి శంకర్‌తో పాటు ప‌లువురు జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని మెడికల్‌ అసోసియేషన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా శంకర్‌ హాజరై మాట్లాడుతూ నెల‌ రోజుల‌ వ్యవధిలో జిల్లాలో నలుగురు జర్నలిస్టులు మృతి చెందడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో భాగంగా వార్త ...

Read More »

సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల‌కు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగుల‌కు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాల్లో సరిపోను సిబ్బందిని నియమించాల‌ని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సులు, 84 మంది లాబ్‌ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టుల‌ను ...

Read More »

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది కరోనా బారిన పడి వైద్య చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ పరిధిలోని 13 వ వార్డులో ఆదివారం నంగునూరు నాగరాజు (48) అనే వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంతమంది కోవిడ్ ల‌క్షణాలు ఉన్నవారు ఇప్పటికే వైద్య సహాయం పొందుతున్నారు. కరోనా కోసం టేక్రియల్‌ గ్రామ ప్రజలు నంగునూరు నాగరాజు చిత్రపటానికి ...

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన దృష్ట్యా ప్రజలు తమ యొక్క ఫిర్యాదుల‌ను ప్రతి సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ఉదయం 10.30 గంటల‌ నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు 8468220044 ఫోన్‌ నెంబర్‌ ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందించాల్సిందిగా కలెక్టరేట్‌ పరిపాల‌న అధికారి పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గిర్నీ తండాలో సర్పంచ్‌ చందర్‌, నాయకులు రెడ్యానాయక్‌, గ్రామస్తులు అందరూ కసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోనే గ్రామాల‌ అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవల‌, రాము, అబ్బార్‌ సింగ్‌, ...

Read More »

కరోన నుంచి కోలుకోవాల‌ని పూజలు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆల‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌లు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద పట్లోళ్ల సిద్ధార్థ రెడ్డి, గ్రామ ప్రజల‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ...

Read More »

కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల‌కు ప్రజలు అందరూ సహకరించాల‌ని మోర్తాడు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలో కూడా అన్ని గ్రామాల‌లో ప్రజలు కరోనా నివారణకు చేపట్టిన చర్యల‌కు అనుకూలంగా మసులుకుంటూ అధికారుల‌కు సహాయ సహకారాలు అందివ్వాల‌న్నారు. దేశంలో కోవిద్‌ 19 సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అందువ‌ల్ల‌నే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్సై సురేష్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ...

Read More »

గల్ఫ్‌లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సందర్బంగా గల్ఫ్‌ తదితర దేశాల‌ నుండి వాపస్‌ వచ్చిన వల‌స కార్మికుల‌కు వారి యాజమాన్యాల‌ నుండి రావల‌సిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల‌ని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు. ‘జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) ...

Read More »

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనంతయ్య కరోనా బారిన పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతయ్య నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని ల‌క్కొర గ్రామానికి చెందిన వాడని, గతంలో మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌లో చాలా రోజులుగా విధులు నిర్వహించి ఇక్కడి ప్రజల‌ మన్ననలు పొందారన్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. అనంతయ్య మృతిచెందడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ ...

Read More »

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు ...

Read More »

రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గ పరిదిలో ఉన్న సొసైటీ చైర్మెన్లు అందరూ కలిసి జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై ఫిర్యాదు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల‌ నుంచి నేరుగా వరి ధాన్యం రైస్ మిల్ల‌ర్లకు తరలించుతున్నామని, తీర అక్కడికి వెళ్లిన లోడుతో ఉన్న లారిల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని అట్టి వారిపై రైస్ మిల్ల‌ర్లు ధాన్యం తీసుకోవడంలో చేస్తున్న ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సాయన్న గాంధారి, అడ్లూర్‌ ఎల్లారెడ్డి సదాశివరెడ్డి, ...

Read More »

కరోనాతో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడువాయి మండల‌ తహశీల్దార్‌ కార్యాల‌యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న విజయ కరోనాతో మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం ఉద్యోగులు రెండు నిమిషాల‌ పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, అదనపు కలెక్టర్‌ మాధవరావు, ఐసిడిఎస్‌ సిడిపిఓ అనురాధ, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఆర్డీవో శీను, కామారెడ్డి తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »