Breaking News

వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో అడవి లింగాల‌ గ్రామానికి చెందిన సత్తవ్వ (65) అనే వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన మెకానిక్‌ సతీష్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.

గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాల‌ను కాపాడిన రక్తదాతను బాలు అభినందించారు. కార్యక్రమంలో రక్తదాతల‌ సమూహ సభ్యుడు ఆకుల‌ శివకృష్ణ,టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article