Breaking News

మంత్రి కెటిఆర్‌ వల్లే ఇంత అభివృద్ధి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల‌ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. గురువారం జాగిర్యాల్‌ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన భవనం ప్రారంభోత్సవం, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యంలో కొత్త జెసిబి నడిపి ప్రారంభించారు.

లింబాద్రి గుట్ట డబుల్‌ బిటి రోడ్డు ప్రారంభం, బాచన్‌ పల్లి వీడీసీ భవనం ప్రారంభం, ముచ్కూర్‌లో నూతన జిపి భవనం, పిహెచ్‌సి భవనం పాఠశాల‌ అదనపు గదులు ప్రారంభించారు. బీటీ రోడ్డు పనుల‌కు శంకుస్థాపన, బడా భీంగల్‌ ఫంక్షన్‌ హాల్‌, మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లింబాద్రి గుట్ట అభివృద్ధి జిల్లా ప్రజల‌ ఆరాధ్య దైవం శ్రీ ల‌క్ష్మీనరసింహస్వామి సేవకుల‌ కోసం వచ్చే వారి కోసం సింగిల్‌ లైన్‌ రోడ్డు డబుల్‌ లైన్‌గా మార్చుటకు 2 కోట్ల 60 ల‌క్షల‌ రూపాయల‌తో డబుల్‌ లైన్‌ సెంట్రల్‌ లైట్స్‌ డివైడర్స్‌ శంకుస్థాపన చేశారు.

మున్సిపాలిటీలో కొత్త జెసిబి సమకూర్చడం జరిగిందని గత రెండు సంవత్సరాల‌ క్రితం భీంగల్‌ గ్రామపంచాయతీ ఒక్క ట్రాక్టర్‌తో ఉన్నదని ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో మూడు ట్రాక్టర్లు, నాలుగు చెత్త తీసుకుపోయే ఆటోలు, మోరీ చెత్త తీయడానికి జెసిబి సమకూర్చడం జరిగిందన్నారు. మొత్తం ఎనిమిది వాహనాలు రెండు సంవత్సరాల‌లో సమకూర్చాల‌ని ఇంత మార్పు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ వ‌ల్ల‌ జరిగిందన్నారు. సుందర పట్టణంగా తీర్చిదిద్దాల‌ని తన ధ్యేయము, కళ అన్నారు.

సాగునీరు సమస్య తీర్చాల‌ని 45 కిలోమీటర్లలో ఉన్న పెద్దవాగు కప్పల‌ వాగు పై 22 చెక్‌ డ్యాములు కట్టుకొని 40 వేల‌ ఎకరాల‌కు నీరు తేవడం ప్యాకేజీ 21 ద్వారా భీంగల్‌ మండల‌ కష్టాలు తొందరలోనే తీర పోతాయన్నారు. జూన్‌ జూలై వరకు 20 వేల‌ ఎకరాల‌కు ప్యాకేజీ 21 ద్వారా నీళ్లు తీసుకు రావాల‌ని ప్రణాళిక ఉందన్నారు. భీమ్‌గల్‌ మండల‌ గ్రామాలైన పచ్చల‌ నడుకుడ, కొత్తపెళ్లి గ్రామాల‌కు సాగునీరు తేవాల‌ని, బాల్కొండ నియోజకవర్గంలో రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు ఇచ్చేవరకు ప్రయాణం ఆగదన్నారు.

ఎస్సారెస్పీ పునర్జీవం పథకం ద్వారా 9 గ్రామాల‌లో 16 చెరువులు నింపుతామన్నారు. కార్యక్రమంలో ఆర్‌డివో శ్రీనివాసు, ఎస్‌సి ఆర్‌అండ్‌బి రాజేశ్వర్‌ రెడ్డి, డీఈఓ దుర్గాప్రసాద్‌, డిఎంహెచ్‌ఓ సుదర్శన్‌, సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున ...

Comment on the article