Breaking News

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పోచారం భాస్కర్‌రెడ్డి

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రాధమిక సహకార సంఘం పరిదిలోని రాంపూర్‌ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల‌నుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో మద్దతు ధరతో ప్రభుత్వం ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కి రైతుల‌ తరుపున ధన్యవాదాలు తెలిపారు.

రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే రైతుల‌కు రందీ లేకుండా పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధాయం సరిగ్గా లేకపోయినా రైతులు ఇబ్బందుల‌కు గురి కాకూడదనే ఉద్యేశంతో పంట ఉత్పత్తుల‌ను కొనుగోలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ, ఇప్పుడు దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా ఇలా మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనడం లేదన్నారు.

తెరాస పార్టీ ఆద్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇలాంటి దైర్యం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రైతులంటే అపారమైన ప్రేమ ఉందన్నారు. రైతు బాగుపడాల‌నే ఉద్యేశంతో అప్పు చేయకుండా ఉండటానికి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఐదువేల‌ రూపాయలు అందిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా వ్యవసాయ రంగానికి 24 గంటల‌ నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారని భాస్కర్‌రెడ్డి చెప్పారు.

దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా రైతుబీమా ద్వారా ఐదు ల‌క్షల‌ రూపాయల‌ సహాయం అందిస్తున్నారని, రైతుబిడ్డ తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గంలో మంజీర నదిపై నాలుగు చెక్‌ డ్యామ్‌లు,ఎత్తిపోతల‌ పథకాలు మంజూరు చేసి రైతాంగానికి ఏడాది పొడవునా సాగునీటి ఎద్దడి లేకుండా చేసి నియోజకవర్గం నీటితో, పచ్చని పంటపొలాల‌తో రైతు ఏటా రెండు పంటల‌తో ఆనందంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌ ద్వారా త్వరలోనే నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వస్తాయని, ఇక ఏటా రెండు పంటల‌కు డోకా ఉండదని, ఇప్పటికే రూ. 150 కోట్లతో నిజాంసాగర్ కాలువ ఆధునికీకరణ పూర్తి చేసుకున్నామన్నారు.

వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైనన్ని గన్నీ బ్యాగుల‌ను సమకూర్చుతామని, ధాన్యం కొనుగోలు చేసిన రైతుల‌కు వెంటనే డబ్బు అందే విదంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో442, కామారెడ్డి జిల్లాలో 338 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తేమ 17 శాతం మించకుండా, చెన్ని పట్టి తాలు, పొల్లు లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని రైతు కొనుగోలు సెంటర్లకు తీసుకురావాల‌ని, నాణ్యమైన మేలురకం ధాన్యానికి రూ, 1888, రెండవ రకానికి రూ. 1868 ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజగౌడ్‌, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, బాన్సువాడ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పాత బాల‌క్రిష్ణ, బాన్సువాడ అగ్రిక‌ల్చ‌ర్‌ ఏడిఏ చంద్రశేఖర్‌, మండల‌ వైస్‌ ఛైర్మన్‌ హరి సింగ్‌, సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ అంబర్‌ సింగ్‌, సర్పంచులు ల‌లిత శ్రీనివాస్‌, నారాయణ రెడ్డి, పీర్‌ సింగ్‌, మండల‌పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ భూషణ్‌ రెడ్డి, నాయకులు వెంకట్‌ రాం రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఎజాజ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌, గంగారాం, సోమేశ్వర్‌ మొగుల‌య్య, జ్యోతి, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ పరిధిలోని రాంపూర్‌ తాండ, రాంపూర్‌, పోచారం, ఇబ్రహీం పెట్‌, సోమేశ్వర్‌ గ్రామాల‌ రైతులు పాల్గొన్నారు.

Check Also

చెక్‌ డ్యాం నిర్మాణ పనుల‌కు శంకుస్థాపన చేసిన స్పీకర్‌, మంత్రి

బాన్సువాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 ...

Comment on the article