Breaking News

ఎస్‌ఆర్‌ఎస్‌పిలో ఆరుగురు గ‌ల్లంతు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోచంపాడ్‌ విఐపి పుష్కర ఘాట్‌ వద్ద గుత్ప గ్రామం మాక్లూర్‌ మండల‌ వాసి సూర నరేష్‌ కొడుకు పుట్టు వెంట్రుకలు తీయుటకు వచ్చి గంగ స్నానాలు చేయుటకు దిగిన ముగ్గురు పిల్ల‌లు నదిలో కొట్టుకు పోతుండగా వాళ్ళ బంధువులు ముగ్గురు దిగి రక్షించడానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయారు.

గ‌ల్లంతయిన వారిలో జీల‌కర్ర సురేష్‌ (40), జీల‌కర్ర యోగేష్‌ (16) వీరిద్దరు తండ్రి కొడుకులు, డీకంపల్లికి చెందినవారు.

బొబ్బిలి శ్రీనివాస్‌ (40), బొబ్బిలి సిద్దార్థ్‌ (16), బొబ్బిలి శ్రీకర్‌ (14) వీరు ముగ్గురు తండ్రి, కొడుకులు, ఎల్ల‌మ్మగుట్ట నిజామాబాద్‌కు చెందినవారు.

దొడ్లే రాజు (24) గుత్ప వాసులు గ‌ల్లంతయ్యారు.

కాగా ఐదు మృతదేహాలు ల‌భ్యమయ్యాయని, జీల‌కర్ర సురేష్‌ కొరకు గాలింపు జరుగుతుందని అధికారులు వెల్ల‌డించారు.

ఘటనా స్థలాన్ని ఆర్మూర్‌ ఏసిపి రఘు, ఆర్మూర్‌ రూరల్‌ సిఐ శ్రీరాం విజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ జనార్ధన్‌, బాల్కొండ, ముప్కాల్‌ ఎస్‌ఐలు రాఘవేందర్‌, హరిప్రసాద్‌ పర్యవేక్షించి గాలింపు చర్యలు చేపట్టారు.

మృతదేహాల‌ వెలికితీతలో కష్టపడ్డ గజ ఈతగాళ్ళను అభినందించారు.

Check Also

ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా చిలుక కిష్టయ్య

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుగా ఎన్నికైన చిలుక కిష్టయ్యని ...

Comment on the article