Breaking News

ఎస్‌ఆర్‌ఎస్‌పి దుర్ఘటన విచారకరం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎస్‌ఆర్‌ఎస్‌పి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఒకటవ పుష్కర ఘాట్‌ దగ్గర జరిగిన దుర్ఘటన బాధాకరం, చాలా విచారకరమని, ఆ కుటుంబ సభ్యుల‌కు ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యుల‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు.

పుష్కర ఘాట్‌లో ప్రతి శుక్రవారం దాదాపు ఐదువేల‌ మంది ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేయడం హిందువుల‌ ఆచారమని, పుష్కర ఘాట్‌ నుంచి ఈత ఈదడానికి పక్కకు వెళ్లి పక్కలో లోతుగా ఉండటం వ‌ల్ల‌‌ ప్రమాదం జరిగిందన్నారు. అంతా పరిశీలించాం ఇటువంటి దుర్ఘటనలు ఎలా అరికట్టాలో ఆలోచన చేస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ఎస్సీ, ఈఈ, ఆర్‌డిఓ అందరితో మాట్లాడటం జరిగిందన్నారు. వెంటనే ఎక్కడైతే పిల్ల‌లు వెళ్లే స్కోప్‌ ఉన్నదో ఈత కొట్టే స్కోపు లోతు ఉన్న చోట ఫినిషింగ్‌ చేయాల‌ని నిర్ణయించామన్నారు.

ఫినిషింగ్‌ ఆర్‌సిసి పిల్ల‌ర్స్‌తో, నెట్‌తో చేయాల‌ని నిర్ణయం జరిగిందన్నారు. నాలుగు పుష్కర ఘాట్లకు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఒక వీఆర్‌ఏ, గజ ఈతగాళ్లను ఉంచాల‌ని ఆదేశించారు. గంగ స్నానానికి వచ్చినవారికి ముందు జాగ్రత్తలు చెప్పడం లోపలికి పోకుండా చూడటం గురించి నిజామాబాద్‌ జిల్లా ప్రజల‌కు ప్రభుత్వ పక్షాన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల‌న్నారు. ప్లాట్‌ ఫారం వరకు వెళ్ళండి, ఎక్కువ లోపలికి పోకుండా చూసుకోవాలి ఇటువంటి దుర్ఘటన జరగకుండా ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి వెంట ఎస్సారెస్పీ ఎస్సీ శ్రీనివాస్‌, ఈఈ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎండోమెంట్‌ సోమయ్య, ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు అర్చకులు ఉన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article