Breaking News

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాల‌ను పరిశీలించిన మంత్రి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల‌ను ఆదివారం మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. అధికారుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల‌ను‌ వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టరును ఆదేశించారు.

పనుల్లో నాణ్యత లోపం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగ శ్రీనివాస్‌, మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌, ఎన్‌డిసిసిబి డైరెక్టర్‌ మెతుకు భూమన్న, టిఆర్‌ఎస్‌ మండల‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article