కామారెడ్డిలో సెంచరీ దాటిన కరోనా కేసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం కరోనా కేసులు సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా 103 కేసులు నమోదు కాగా, 14,434 కు చేరుకుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలు సేకరించడంలో అధికారులు విఫల‌మవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా ల‌క్షణాల‌తో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరుగుతున్నారు. గత మార్చి నెల‌లో 464 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన ఐదు రోజుల‌లోనే 329 కేసులు నమోదయ్యాయి.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article