Breaking News

రజకుల‌ హర్షం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద తెలంగాణ రజక సంఘాల‌ సమితి రాష్ట్ర కన్వీనర్‌ మానస గణేష్‌ ఆధ్వర్యంలో కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రజకుల‌కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ జివో జారీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాల‌కు క్షీరాభిషేకం చేశారు.

మానస గణేష్‌ మాట్లాడుతూ రజకుల‌ ఆర్థిక స్థితిగతుల‌ను చూసి వారిని ఆర్థికంగా ఆదుకోవాల‌నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు లాండ్రీల‌కు, దోబీఘాట్‌ల‌కు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇచ్చేందుకు జీవో జారీ చేసినందుకు తెలంగాణ రజకులందరి తరపున కెసిఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్‌ 2018 లో రజకుల‌కు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నందుకు రజకులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం లాండ్రీలు నడిపే నిరుపేద రజకుల‌కు ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ అధ్యక్షుడు శంకర్‌, జిల్లా యువజన అధ్యక్షుడు శ్రావణ్‌, కోశాధికారి అనంత్‌, పెర్కిట్‌ శ్రీనివాస్‌, చౌదరి రమేష్‌, పాడిగేలా శేఖర్‌, ఆలూర్‌ శేఖర్‌, కొండూర్‌ గంగాసాగర్‌ రాజేశ్వర్ బజమోల్ల‌ నరేష్‌, స‌ల్ల‌గరిగే అభిలాష్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article