చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల‌ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల‌ స్తూపం వద్ద కొవ్వొత్తుల‌తో నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీజేయం రాష్ట్ర నాయకుడు నరేంధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్‌ ఘడ్‌లో జరిగిన నక్సలైట్‌ దాడి అతిదారుణమైన సంఘటన అని దాడుల‌లో వీర మరణం పొందిన 22 మంది సైనికుల‌కు వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు.

నక్సలిజంను మూలాల‌ నుండి పెకలించడమే అమరవీరుల‌కు అసలైన నివాళి అన్నారు. దురదృష్టవశాత్తు కొంత మంది మేధావుల‌ ముసుగులో నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నారని ప్రజాస్వామ్య భారతంలో తుపాకుల‌తో రాజ్యాధికారం అసాధ్యమని పేర్కొన్నారు.

మన జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టుల‌ని కమ్యూనిస్టుల‌ని హీరోలుగా చూయించే సినిమాని ఎందుకు నిషేదించవద్దని ప్రశ్నించారు. నక్సల్స్‌ మరియు వారి సానుభూతి పరులైన వారిని యోధులుగా గొప్పవారిగా చిత్రీకరిస్తు సినిమాలు తీయడం ఎంతవరకు సమంజసమని, అసలు ఈ సినిమాల‌తో యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు అని వాపోయారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article