శ్రీనివాస్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం ఆంగ్ల విభాగపు పరిశోధక విద్యార్థి ఎ. శ్రీనివాస్‌కు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో పని చేసి, ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.సవీన్‌ సౌదా పర్యవేక్షణలో ‘‘నియో స్లేవ్‌ నేరటీవ్స్‌ ఇన్‌ సెలెక్ట్‌ నావెల్స్‌ బై ఎడ్వార్డ్‌ జోన్స్‌ అండ్‌ టోని మోరిసన్‌’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు.

పిహెచ్‌.డి. ఓపెన్‌ వైవా వోస్‌కు హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల విభాగ ప్రొఫెసర్‌ డా. కె. కృష్ణయ్య ఆన్‌ లైన్‌ (వర్చువల్‌) వేదిక మీదకు హాజరై పరిశోధకుడిని పరిశోధానాంశంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు ఆర్ట్స్‌ పీఠాధిపతి ప్రొఫెసర్‌ పి. కనకయ్య చైర్మన్‌గా, బిఓఎస్‌ డా. సమత కన్వీనర్‌గా వ్యవహరించారు. విభాగాధిపతి డా. రమణాచారి, అకడమిక్‌ కన్సల్టెంట్స్‌ డా. జ్యోత్స్న, డా. స్వామి, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిశోధకులు ఎ. శ్రీనివాస్‌ అదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీనివాస్‌ పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు ...

Comment on the article