Breaking News

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు 250 యూనిట్ల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నందుకు మంగళవారం మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో చాకలి ఐల‌మ్మ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి చిత్రపటాల‌కు పాలాభిషేకం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకుల‌కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని పేదల‌ పక్షాన ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రజక యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article