అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను, మిల్ల‌ర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో పౌర సరఫరాల‌ అధికారులు, మిల్ల‌ర్లతో ధాన్యం కొనుగోళ్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 345 కేంద్రాల‌ ద్వారా 5 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతున్నందున, అధికారులు మిల్ల‌ర్లు పూర్తి సమన్వయంతో పనులు చేపట్టాల‌ని, ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించాల‌ని అధికారుల‌ను, కొనుగోళ్ళు చేసిన ధాన్యాన్ని కేంద్రాల‌ నుండి వెంటనే మిల్లులకు తరలించాల‌ని మిల్ల‌‌ర్లను ఆదేశించారు. ధాన్యాన్ని ఖచ్చితమైన ప్రమాణాల‌తో, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాల‌ని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపు చేయాల‌ని ఆదేశించారు.

కొనుగోళ్లు, మిల్లుల‌కు ధాన్యం చేరే విషయంలో ఎలాంటి అల‌క్ష్యం ప్రదర్శించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో స్విస్‌ సప్లయ్‌ డిఎం జితేందప్రసాద్‌, జిల్లా పౌర సరఫరాల‌ అధికారి కొండల్‌ రావు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌, ఎఫ్‌సిఐ డివిజనల్‌ మేనేజరు అశోక్‌ కుమార్‌, జిల్లా మిల్ల‌ర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరీశంకర్‌, మిల్ల‌ర్స్‌ ప్రతినిథులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article