Breaking News

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ముసల‌మ్మ చెరువులో బుధవారం ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనిని స్థానిక ఎంపిడిఓ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం కూలీల‌తో ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముసల‌మ్మ చెరువును పరిశీలించిన ఎంపీడీవో గ్రామస్తుల‌పై‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెరువు నుండి వచ్చే నీరు పంట పొలాల‌కే కాకుండా పశువులు ప్రజలు కూడా తాగుతారని ఇంత మంచి నీటిని గ్రామస్తులు కాల‌ కృత్యాల‌తో కలుషితం చేస్తున్నారని ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇకనైనా గ్రామస్తులు మేల్కొని ఇటువంటి చర్యల‌కు పూనుకోవడం మానుకోవాల‌న్నారు.

గ్రామాభివృద్ధి కమిటీ వారు ముసల‌మ్మ చెరువు విషయంలో పట్టించుకోని ఎవరు కూడా చెరువులో కాల‌కృత్యాల‌కు వెళ్లకుండా చూడాల‌న్నారు. ఇక్కడ ముసల‌మ్మ చెరువు ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు పనిచేసి ఇటువంటి కలుషితమైన నీటిని త్రాగితే అనారోగ్యాల‌కు గురవుతారని ఎంపీడీవో అన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article