Breaking News

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని తక్కూరి వాడలో బుధవారం పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ బద్దం అశోక్‌ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పిఎసిఎస్‌ వారి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాల‌ని అన్నారు రైతులు దళారుల‌ను నమ్మి మోసపోవద్దన్నారు.

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర అందుకోవాల‌ని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు 1888 రూపాయలు, అలాగే తేమ 17 శాతం మాత్రమే ఉండాల‌ని ఎటువంటి కడత ఉండదని సొసైటీ కార్యదర్శి కాశీరాం తెలిపారు.

కార్యక్రమంలో మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివ లింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జడ్పిటిసి బద్దం రవి, డిసిసిబి డైరెక్టర్‌ మోతుకు భూమన్న, కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పాపాయి పవన్‌, భోగ ఆనంద్‌, మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌, ఏఈఓ శ్రీల‌త, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article