డ్రైవర్‌ కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారి అధ్యక్షులుగా గల‌ నియామకాల‌ కమిటీ ద్వారా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పంపిణీ చేయబడిన సంచార రక్త సేకరణ వాహనంలో పనిచేయటానికి అనుభవం గల‌ వైద్యుడు, డ్రైవర్‌ పోస్టుల‌కు ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంబిబిఎస్‌ పూర్తిచేసి రక్తసేకరణ, వర్గీకరణ మొదలైన అంశాల‌లో అనుభవంగల‌ వైద్యులు అర్హుల‌ని, వైద్యుని నెల‌సరి భత్యం రూ. 40 వేలు, పదవ తరగతి ఉత్తీర్ణతగల‌ హేవి వెహికల్‌ లైసెన్సు కలిగిన అభ్యర్థులు డ్రైవర్‌ పోస్టుకి అర్హుల‌ని తెలిపారు. డ్రైవర్ నెల‌సరి భత్యం రూ. 16 వేలు అన్నారు.

అర్హతగల‌ అబ్యర్థులు తమ దరఖాస్తుల‌ను మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఏరియా ఆసుపత్రి, బాన్సువాడ కార్యాల‌యంలో ఈనెల‌ 12 నుంచి 20వ తేదీ వరకు సమర్పించవచ్చన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article