వాక్సినేషన్‌ కేంద్రాలు పెంచాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కేంద్రాల‌లో వాక్సినేషన్‌ పాయింట్స్‌ పెంచాల‌ని, 45 సంవత్సరముల‌ వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా పిహెచ్‌సి, సిహెచ్‌సి వైద్య అధికారులు, స్టాటిస్టికల్‌ ఆఫీసర్లతో కరోనా పరీక్షలు, ట్రేసింగ్‌, వాక్సినేషన్‌పై ఆరోగ్య కేంద్రాల‌ వారిగా సమీక్షించారు.

ఎర్రపహాడ్‌ ఆరోగ్య కేంద్రం వాక్సినేషన్ ల‌క్ష్యాన్ని సాధించినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. వాక్సినేషన్‌ నిజాంసాగర్‌ లింగంపేట, ఉత్మూర్‌, బిచుకుంద, గాంధారి ఆరోగ్య కేంద్రాల‌లో ఆశించినంత ల‌క్ష్య సాధన జరుగలేదని అన్నారు. వాక్సినేషన్‌ కేంద్రాల‌లో అదనంగా రెండు లేదా మూడు వాక్సినేషన్‌ పాయింట్స్‌ పెంచుకోవాల‌ని, అన్ని ఆరోగ్య కేంద్రాల‌లో ఆశా వర్కర్లు, గ్రామ పంచాయితీ సర్పంచ్‌, పంచాయితీ కార్యదర్శి, గ్రామ పోలీసు అధికారుల‌ సహకారంతో 45 సంవత్సరముల‌ పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

కోవిద్‌ పరీక్షలు పెంచాల‌ని, ప్రయిమరీ కాంటాక్టును గుర్తించి పరీక్షలు నిర్వహించాల‌ని, ర్యాపిడ్‌ ఆంటిజమ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ ప్రతి కేంద్రంలో 500 కిట్స్‌కు తగ్గకుండా అందుబాటులో వుండాల‌ని, సరిహద్దు ప్రాంతాల‌లో చెక్‌ పోస్టు పాయింట్స్‌ ద్వారా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాల‌ని, ప్రభుత్వ ఐసోలేషన్‌, కోవిద్‌ కేర్‌ కేంద్రాల‌ను వినియోగించాల‌ని ఆదేశించారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article