కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు సిద్ధం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్‌లో వంద పడకల‌ స్థాయికి, ఆర్మూర్‌, బోధన్‌లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాల‌ని తెలిపారు.

అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాల‌నీ, అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రోగుల‌కు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. సంబంధిత ఆర్టీవోలు సహకారం అందించాల‌ని కోరారు. ప్రభుత్వం, మంత్రి ఆదేశించిన ప్రకారం ఇతర అన్ని చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Check Also

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు ...

Comment on the article