ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ సినిల్‌ సప్లయ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాల‌యంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన కంట్రోల్‌ రూమ్‌ అధికారులు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. 08468-220051 నెంబరుతో ఏడు క్లస్టర్‌ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌లో ఏ రోజు ఎంత మంది రైతుల‌ నుండి కొన్నారు, ఎంత టార్గెట్‌కు ఎంత కొనుగోలు చేశారు, ఎంత మంది రైతుల‌ వివరాలు ట్యాబ్‌లో నమోదు అయ్యాయి అనేది నిరంతరం పరిశీలించాల‌ని ఆదేశించారు.

ప్రతి కొనుగోలు కేంద్రం సిఇఓ, ట్యాబ్‌ ఎంట్రీ ఆపరేటర్లతో పరిస్థితిని సమీక్షించుకోవాల‌ని, హమాలీలు, గన్నీ బ్యాగ్లు, లారీ ట్రాన్స్‌పోర్టు, కొనుగోలు, ధాన్యం లిఫ్టింగ్‌ సమస్యలు పరిశీలించాల‌ని, కంట్రోల్‌ రూమ్‌ ఉద్దేశం నెరవేర్చాల‌ని, రైతుల‌ నుండి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు పాయింట్‌ వరకు చేరే విధానాన్ని, రైతుల‌కు అతని ఖాతాలో డబ్బు జమ అయ్యే విధానాన్ని పర్యవేక్షించాల‌ని సూచించారు.

కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజరు జితేంద్ర ప్రసాద్‌, డిఎస్‌ఓ కొండల్‌ రావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రజని, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌, మిల్ల‌ర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్‌, సివిల్‌ సప్లయ్‌, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article