Breaking News

టీకాతోనే రక్షణ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలు టీకా తీసుకొని కోవీడు మహమ్మారిని తరిమివేయాల‌ని మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆయా గ్రామాల‌ ప్రజల‌కు సూచించారు. టీకా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాల‌న్నారు. టీకాతో ప్రాణానికి వంద శాతం మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని, ప్రజలందరూ మాస్కు ధరిస్తే లాక్‌ డౌన్‌తో సమానమేనని ఎస్‌ఐ వివరించారు.

ప్రజలు ఎవరూ కూడా గుంపులుగుంపులుగా ఉండరాదని సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు శుభకార్యాల్లో ఎక్కువ మంది పాల్గొనకూడదని, శుభకార్యాల‌లో మార్కెట్లలో కిరాణా షాపుల‌ వద్ద గాని ఇతర షాపుల‌ వద్ద గాని ప్రజలందరూ మాస్కులు ధరించి సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని ఆయా గ్రామాల‌ ప్రజలు మాస్కులు ధరించి అధికారుల‌కు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందివ్వాల‌ని కోరారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article