ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ ఇంఛార్జి భూపతి రెడ్డి హాజరై ఎన్‌.ఎస్‌.యూ.ఐ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యల‌పై పోరాడే తత్వం మరియు నాయకత్వ ల‌క్షణాన్ని పెంపొందించి వారిని అత్యున్నత పౌరులుగా తీర్చి దిద్దగలిగె ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఎన్‌.ఎస్‌.యూ.ఐ విద్యార్థి సంఘం అని అన్నారు. 1951 ఏప్రిల్‌ 9న అప్పటి ప్రధానమంత్రి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు ఇందిరగాంధీ విద్యార్ధుల‌ను దేశ నిర్మాణంలో భాగం చేయాల‌నే ఉద్దేశంతో ఎన్‌.ఎస్‌.యూ.ఐ విద్యార్థి సంఘాన్ని స్థాపించారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్‌.ఎస్‌.యూ.ఐ సమాజంలోని విద్యారంగ మరియు ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యల‌పై పోరాటం చేసి విజయం సాధించిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సాధించిన అనేక విజయాల్లో ఎన్‌.ఎస్‌.యూ.ఐ పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. దేశంలో ఏ విద్యార్థి సంఘానికి లేని సభ్యత్వం ఎన్‌.ఎస్‌.యూ.ఐ విద్యార్థి సంఘానికి ఉందన్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఎన్‌.ఎస్‌.యూ.ఐ చురుకైన పాత్ర పోషించిందని, ఇప్పుడు రాష్ట్రంలో విద్య వ్యవస్థ సరిగా లేదని మరియు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణా వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని బంగారు తెలంగాణా చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగుల‌ను మరియు విద్యార్ధుల‌ను మోసం చేశాడన్నారు.

ఈ కారణంగానే తెలంగాణ వచ్చాక కూడా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎన్నికల‌ సమయంలో బంగారు తెలంగాణా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆత్మహత్యల తెలంగాణ మరియు నిరుద్యోగ తెలంగాణ చేస్తున్నాడని కాబట్టి మోసకారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్‌.ఎస్‌.యూ.ఐ లోని ప్రతి విద్యార్థి నాయకుడు నడుం బిగించాల‌న్నారు.

కార్యక్రమంలో నగర‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ప్రమోద్‌, యూత్‌ కాంగ్రెస్‌ నగర ఉపాధ్యక్షుడు జహెర్‌ బీన్‌ హందన్‌, ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా ప్రధాకార్యదర్షులు వేదమిత్ర,భాను మరియు జిల్లా నాయకులు రమేష్‌ చంద్ర, ముస్సు పటేల్‌,సూర్య, వికాస్‌, సాయి,రోహిత్‌, ఉమకంత్, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు ...

Comment on the article