మహమ్మారి నిర్మూల‌నకు మన జాగ్రత్తలే ప్రధానం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు శాఖ తీసుకోవల‌సిన చర్యల‌ గురించి శుక్రవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్‌. మహేందర్‌ రెడ్డి, ఐ.పి.యస్‌ వీడియో కాన్స్‌ రెన్స్‌ నిర్వహించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత గురించి ప్రజల‌కు వివరిస్తూ నివారణకు గానూ ప్రతి ఒక్కరు మాన్క్‌ ధరించడం అత్యంత ప్రధానమని ప్రజల‌కు అవగాహన కలిగించాల‌ని సూచించారు.

పోలీసు సిబ్బంది స్వయంగా కోవిడ్‌ నిబంధనలు పాటించడం కుటుంబ సభ్యుల‌ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని కోవిడ్‌ అంటువ్యాధి వల‌న గతంలో ఎదుర్కొన్న కష్టనష్టాల‌ను తెలుపుతూ ప్రజల‌ను అప్రమత్తం చేయాల‌న్నారు. బయటకు వచ్చేవారు మాస్క్‌ ధరించడంలో అల‌సత్వం వహిస్తే, ప్రమాదం కొని తెచ్చుకోవడమే అవుతుందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని‌, కోవిడ్‌ మహామ్మరి నిర్మూల‌నకు మనము తీసుకునే జాగ్రత్తలే ప్రధానమని పెద్ద ఎత్తున ప్రచారం జరగాల‌ని అన్నారు.

అన్ని జిల్లాల్లో పోలీస్‌ శాఖ వైపు నుండి జరుగుతున్న కృషి పట్ల రాష్ట్ర డి.జి.పి సంతృప్తి వ్యక్తం చేస్తూ, వివిధ శాఖలు స్వచ్చంధ సంస్థల‌ సమన్వయం, సహాకారంతో పని చేద్దామన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా, ఐ.పి.యస్‌., అదనపు డి.సి.పి (డి.టి.సి) అరవింద్‌ బాబు అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాద్‌, టి అదనపు డి.సి.పి (ఎ.ఆర్‌) భాస్కర్‌, నిజామాబాద్‌ ఎ.సి.పి జి. శ్రీనివాస్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఎ.సి.పి ప్రభాకర్‌ రావ్‌, సి.ఐలు ఎస్‌.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article