15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల‌ వివరాలు అందించండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాల‌ని ఆ కుటుంబాల‌ను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆదుకుంటుందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం బీఆర్కె భవన్‌ నుండి ఆమె పౌరసరఫరాల‌ శాఖ మంత్రి గంగుల‌ కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సల‌హాదారు రాజీవ్‌ శర్మతో కలిసి అన్ని జిల్లాల‌ కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల‌ శాఖ డిసిఎస్వోు, డిఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ ఒక్కరికి రూ. 2 వేలు, 25 కేజీల‌ బియ్యం అందించడానికి సిరియల్‌ తీసుకోవాల‌న్నారు. ఈ నెల‌ 10వ తేది నుండి 15 వ తేది వరకు ఎంఈఓ ద్వారా డేటా సేకరించాల‌ని, ఏప్రిల్‌ 28 వ తేది వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల‌ని‌ మంత్రి ఆదేశించారు.

ఇందుకు సంబంధించి విధి విధానాల‌ను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల‌ను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 2 వేలు ఆపత్కాల‌ ఆర్ధిక సాయంతో పాటు ప్రతి కుటుంబానికి 25 కేజీల‌ బియ్యాన్ని రేషన్‌ షాపు ద్వారా ఉచితంగా సరఫరా చేయాల‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాల‌లు 450, బోధన, బోధనేతర సిబ్బంది 6204, వీరి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా, ఇతర వివరాల‌ను వెంటనే సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, సివిల్‌ సప్లైస్‌ అధికారులు వెంకటేశ్వరరావు, అభిషేక్‌ సింగ్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article