Breaking News

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ విద్యా శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓల‌తో, మున్సిపల్‌ కమీషనర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం, 25 కిలోల‌ బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు స్కూల్స్‌ కరస్టాండెంట్లతో సిబ్బంది వివరాల‌ను సేకరించాల‌ని, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు, మండల‌ విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వారు ఇచ్చిన వివరాల‌ను పరిశీలించాల‌ని, ఆధార్‌ కార్డు వివరాలు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ నెంబర్లను ఒకటికి రెండు సార్లు పరిశీల‌న చేసి రెండు రోజుల్లో సమర్పించాల‌ని ఆదేశించారు.

అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ సహాయం పొందకుండా ఉండరాదని అలాగే అనర్హుల‌ను చేర్చరాదని సూచించారు. వివరాల‌ను నిర్ణీత ఫార్మాట్లలో సాఫ్ట్‌, హార్డ్‌ కాపీ రూపంలో పొందుపరచి సమర్పించాల‌ని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌లు, జిల్లా పంచాయితీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల‌తో మాట్లాడుతూ, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌గా వున్న వైద్య, రెవెన్యూ, పోలీసు పంచాయితీలు, ఐసిడిఎస్‌ సిబ్బందిలో వేసుకోని వారిని పరిశీలించి వచ్చే రెండు రోజుల్లో వంద శాతం వాక్సినేషన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

అలాగే జిల్లా అధికారులు తమ సిబ్బంది 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. స్థానిక సంస్థల‌కు సంబంధించి 45 సంవత్సరాలు వయస్సు పైబడిన గ్రామ పంచాయితీ సర్పంచ్‌లు, మండల‌ స్థాయి, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, మెంబర్లు, మున్సిపల్‌ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ వంద శాతం వాక్సిన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాల‌ని డిపిఓను, మున్సిపల్‌ కౌన్సిల‌ర్లను ఆదేశించారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article