మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడ్ ల‌క్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని క్వారంటైన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారుల‌తో కలిసి పర్యటించి కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాల‌పై ల‌క్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌న్నారు.

24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాల‌ని ఆదేశించారు. ప్రతిరోజు వారిని వైద్యపరంగా పరిశీల‌న చేయాల‌ని, అవసరమైన చికిత్సలు అందించాల‌ని ప్రత్యేకంగా సూచించారు. ప్రతి గదిలో కూడా అత్యవసర కాంటాక్ట్‌ నెంబర్‌ రాసి ఉంచాల‌న్నారు. కేంద్రం పరిధిలో లైటింగ్‌ ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. ల‌క్షణాలున్న పేషెంట్లను తప్పనిసరిగా చేర్చుకోవాల‌ని కనీసం ఐదు రోజులు కేంద్రంలో ఉండేలా చూడాల‌ని కరోనా అని చెప్పి వచ్చేవారిని అందర్నీ పాజిటివ్‌గా ఆలోచించి అవసరమైన చర్యలు తీసుకోవాల‌న్నారు.

అంబులెన్స్‌ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాల‌ని, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి దానిని ఉపయోగించుకోవాల‌ని సూచించారు. కేంద్రంలో ప్రస్తుతం 10 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వంద పడకల‌ వరకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఓ రవికుమార్‌, తహసిల్దార్‌ ఆంజనేయులు, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ తుకారాం, వైద్యాధికారి డాక్టర్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు ...

Comment on the article