సిఎం సహాయనిధి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 13 ల‌క్షల‌ 86 వేల‌ 500 రూపాయల‌ చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 608 మందికి 3 కోట్ల 96 ల‌క్షల‌ 64 వేల‌ 300 రూపాయల‌ చెక్కుల‌ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాల‌కు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చు అయిన డబ్బును ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి బిల్లును తమ కార్యాల‌యానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బు ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. అవకాశాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాల‌ని కోరారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article