నిరుద్యోగుల‌ను ఆదుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని కారణంగా ఇటీవల‌ ప్రైవేట్‌ టీచర్లు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వేముల‌వాడ, నాగార్జునసాగర్‌లో భార్య భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కుడా లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

చనిపోయిన కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకొని 10 ల‌క్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని, చనిపోయిన రవి ఇద్దరు పిల్ల‌ల‌ భవిష్యత్‌ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల‌ని, పిల్ల‌ల‌ పేర్ల మీద 10 ల‌క్షలు డిపాజిట్‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల‌కు కనీసం 5 వేల‌ రూపాయలు వెంటనే ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article