Breaking News

దేగాంలో వ్యాక్సినేషన్‌ అభియాన్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాక్సినేషన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో కరోన వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్‌ బాటిల్స్‌, బిస్కేట్స్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మండల‌ అధ్యక్షు రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోన రెండవ దశ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఉన్న మార్గాలు ఒకటి వ్యాక్సిన్‌ వేయించుకోవడం, రెండవది మాస్క్‌ దరించడం, 45 సంవత్సరాల‌ వయసు దాటిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోన వ్యాక్సిన్‌ తీసికొని సురక్షిత భారతాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల‌ని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్‌ మండల‌ అధ్యక్షు రోహిత్‌ రెడ్డి, మండల‌ ప్రధాన కార్యదర్శి రవిగౌడ్‌, జిల్లా బీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌, కోవిడ్‌ వ్యాక్సిన్‌ కన్వీనర్‌ ప్రణీత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవీడు కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి ప్రజల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి ...

Comment on the article