Breaking News

సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల‌కు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్‌ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్‌ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్‌ నారాయణ రెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ బి పాటిల్‌, పలువురు అధికారులు సంఘాల‌ ప్రతినిధులు పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో సంస్క ృతులు, భాషలు, ఆచారాలు, కులాలు, మతాలు, వర్గాల‌కు చెందిన ప్రజలు ఉన్నప్పటికీ వారినందరిని ఒక్క తాటిపై నిలిచే విధంగా అందరికి సమాన అవకాశాలు కల్పించడంతోపాటు పేదల‌కు, అణగారిన వర్గాల‌కు అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్లు అందించడానికి, తద్వారా భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగడానికి ఆయన సుస్థిర రాజ్యాంగాన్ని మనకోసం రాశారని ప్రస్తుతించారు.

తద్వారా పరదేశీయుల‌ నుండి విముక్తం అయిన తర్వాత స్వతంత్ర భారతదేశం అప్పటివరకు ఉన్న ఎన్నో సమస్యల‌ను సవాళ్లను అధిగమించి ఎన్నో దేశాల‌కు ఆదర్శంగా అభివృద్ధిలో ముందుకు వెళ్లగలుగుతున్నదని తెలిపారు. మనకు స్వాతంత్య్రం కంటే ముందు అభివృద్ధిలో ఉన్న దేశాలు ఎన్నో సమస్యల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగం వ‌ల్ల‌ మనం మంచి స్థితిలో ముందుకు సాగుతున్నామన్నారు.

ఆయన ఆశయాలే స్ఫూర్తిగా మనమంత ముందుకు సాగడంతోపాటు ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి పేద ప్రజల‌ను చైతన్యవంతుల‌ను చేయడానికి తద్వారా దేశం ప్రాంతం అభివృద్ధి కావడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయవల‌సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు.

మన ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వర్గాల‌ ప్రజల‌కు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వాటిని అర్హుల‌కు అందే విధంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళవల‌సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, పలు సంఘాల‌ నాయకులు, ప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article