కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, బస్టాండు, మార్కెట్‌, బిసి కాల‌నీ, వినాయక్‌ నగర్‌లో ప్రజల‌కు, దుకాణ యాజమానుల‌కు ‘‘కోవిడ్‌ 19’’ నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని సూచించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని, ఎవరికైనా కరోన ల‌క్షణాలుంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల‌ని సూచించారు.

వైద్యులు తెలిపిన సూచనలు పాటించాల‌న్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోన టీకా తీసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో కోటగిరి ఎస్‌హెచ్‌వో కృష్ణ (ఎస్‌ఐ), సర్పంచ్‌ పత్తి ల‌క్ష్మణ్‌, పోలీస్‌ కళాబృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article