Breaking News

కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సువర్ణ అనే మహిళకు ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలుని సంప్రదించారు. వారికి కావల‌సిన రక్తాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బండారి సురేందర్‌ రెడ్డి మరియు దోమకొండకు చెందిన గణేష్‌ సహకారంతో రెండు యూనిట్ల రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుతం కరోణ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని, గత సంవత్సరం కూడా కరోణ సమయంలో 368 యూనిట్ల రక్తాన్ని 50 యూనిట్ల ప్లాస్మాను అందజేసి ప్రాణాలు కాపాడామని అదే స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాది జడ రజినీకాంత్‌, టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article