నిజామాబాద్‌ జిల్లాకు 1000 డోసుల‌ రెమెడెసివిర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ బాధితుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎల్ల‌ప్పుడూ సంసిద్దంగా ఉందని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల‌ జిల్లాల్లో కోవిడ్‌ 19 పరిస్థితిపై సమీక్షించారు.

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌, జగిత్యాల‌ జిల్లా కలెక్టర్‌ రవితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, కరోనా పరీక్షలు, చికిత్స, ఆసుపత్రులు వంటి అన్ని అంశాల‌పై చర్చించారు. శనివారం నిజామాబాద్‌ జిల్లాకు 1000 డోసుల‌ రెమెడెసివిర్‌ వాక్సిన్‌ రానుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత దృష్ట్యా, సరిహద్దు ప్రాంతాలు మరింత జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కోవిడ్‌ బెడ్లతో పాటు, నిజామాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో 1200 బెడ్లు, కామారెడ్డి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 400 బెడ్లు, జగిత్యాల‌ జిల్లాలో 400 బెడ్లు కరోనా పేషెంట్ల కోసం సిద్ధంగా ఉన్నాయని అధికారులు కవితకు వివరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల‌లో తగినన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాల‌ని ఎమ్మెల్సీ సూచించారు.

ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు త్రాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌న్నారు. అంబులెన్స్‌లు కూడా 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాల‌ని, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవాల‌ని కోరారు.

Check Also

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక ...

Comment on the article