Breaking News

నిజాంసాగర్‌లో 19 మందికి పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు.

వీరిలో
బంజపల్లి 8
అచ్చంపేట్‌ 3
మ‌ల్లూర్‌ తండా 1
మాగి షుగర్‌ ఫ్యాక్టరీ 2
మాగి 1
సింగీతం 1
తెల్లాపూర్‌ 3

నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 56 మందికి ర్యాపిడ్‌ టెస్టు చేయగా అందులో 15 మందికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు, అలాగే బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రాధాకిషన్‌ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండి తప్పకుండా ముఖానికి మాస్క్‌ ధరించాల‌న్నారు.

బయటకు వెళ్లే సమయంలో శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరచుకోవాల‌న్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా సామాజిక దూరం పాటించాల‌న్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాల‌లో శుక్రవారం 147 మందికి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 105 మందికి కరోన వ్యాక్సినేషన్‌ మొత్తం 252 మందికి ఇవ్వడం జరిగిందన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article