Breaking News

కంటికి కనబడని కరోనా – ప్రజలు పరేషాన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో ఎక్కడ చూసినా ప్రజలు కరోనాతో భయభ్రాంతుల‌కు గురవుతున్నారు. అదిగో ఆ గ్రామంలో వచ్చింది కరోనా, ఇదిగో ఈ గ్రామంలో వచ్చింది అని చెప్పి ప్రజలు జంకుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధిహామీ కూలీలు కూడా కూలి పనికి వెళ్లడానికి భయపడి పని మానేస్తున్నారని వినికిడి.

కరోనాతో అక్కడ చనిపోయారు ఫలానా గ్రామంలో చనిపోయారని ప్రజలు గుసగుసలాడుతున్నారు తప్ప అధికారులు మాత్రం గ్రామాల్లో ఎటువంటి కేసులు లేవని అంటున్నారు. ఇక్కడ ఎవ్వరు చనిపోయినా కరోనా బారినపడి చనిపోయారేమోనని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు ప్రజల‌కు కరోనా వాక్సిన్‌ ఇప్పిస్తున్నప్పటికీ ప్రజలు స్వచ్చందగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు.

ప్రభుత్వ అధికారులు ఒక ఇంట్లో ఎందరు టీకా అవసరం ఉన్న వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని గమనించి వారిని ఇళ్ళనుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు. లేనిపక్షంలో ఆశా వర్కర్లు అంగన్‌వాడి కార్యకర్తలు టీకాకు అర్హులైన వారిని వారి ఇళ్ల నుండి రప్పించి టీకాలు ఇప్పించి ప్రజలు కోవిడ్‌ బారినపడకుండా కాపాడాల‌ని సంబంధిత అధికారుల‌ను స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article