Breaking News

40 వేల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు గుల్‌ గుస్తాలో జరుగుతున్న పనుల‌ను రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలం లోని జక్కాపూర్‌ గ్రామ శివారులో గల‌ 476.25 కోట్లతో నిర్మించిన నాగ మడుగు ఎత్తిపోతల‌ నిర్మాణ పనుల‌కు భూమి పూజ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటిని విడుదల‌ చేసిన సందర్భంగా సందర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగ మడుగు ఎత్తిపోతల‌ పథకం ద్వారా నిజాంసాగర్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల‌కు 40 వేల‌ ఎకరాల‌కు సాగునీరు అందుతుందన్నారు. నాగ మడుగు ఎత్తిపోతల‌ పథకం భూమిపూజ సీఎం కేసీఆర్‌ ద్వారా చేయడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీరు వారం రోజులు వస్తుందన్నారు. సుల్తాన్‌ నగర్‌ గ్రామ శివారులో హెలిప్యాడ్‌ పనులు జరుగుతున్నాయన్నారు.

కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు దుర్గారెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల‌ అధ్యక్షుడు సాధుల‌ సత్యనారాయణ, మండల‌ సర్పంచ్‌ల‌ ఫోరం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, నాయకులు రమేష్‌ కుమార్‌, అప్జల్‌, శ్రీధర్‌, తదితరులు ఉన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article