అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోసానిపెట్‌ గ్రామంలో కోవిడ్‌ టీకాతో ఓ వ్యక్తి మరణించారని అసత్య ప్రచారం చేస్తుండడంతో దీనికి వైద్యాధికారి, ఎస్‌ఐ, గ్రామ సర్పంచ్‌ స్పందించి వెంటనే అక్కడికి వెళ్లి విచారించారు. మరణ కారణం కోవిడ్‌ టీకా కాదని, ఇంటి సమస్యల‌తో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కానీ కొందరు ఇలా అసత్య ప్రచారం చేశారు.

ఇలా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. కోవిడ్‌ టీకా 45 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు తీసుకోవాల‌ని వైద్యాధికారి షాహీద్‌ ఆలి తెలిపారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article