20 న పి.జి.స్పాట్‌ అడ్మిషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌లో ఈ నెల‌ 20 న పి.జి. సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎం.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎం.కాం., ఎం.ఎ. తెలుగు, ఎం.ఎ. ఎకనమిక్స్‌, ఎం.ఎస్‌.డబ్ల్యు కోర్సులో మిగిలిపోయిన సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఉస్మానియా విశ్వవిద్యాల‌యం నిర్వహించిన పి.జి.సెట్‌ రాసినవారితో పాటు రాయనివారు కూడా అర్హులేనన్నారు. అర్హత గల‌ విద్యార్థులు ఈ నెల‌ 20 న ఉదయం తమ ఒరిజినల్‌, జిరాక్స్‌ సర్టిఫికెట్ల‌‌తో స్వయంగా హాజరు కావాల‌ని ప్రిన్సిపాల్‌ కోరారు.

Check Also

నిఘా పటిష్టంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిహద్దు గ్రామాల‌లో రాకపోకల‌పై నిఘా ఏర్పాట్లను పఠిష్టంగా నిర్వహించాల‌ని ...

Comment on the article