రెండు నెంబర్లు 24 గంటలు పనిచేస్తాయి…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కారణంగా జిల్లా స్థాయిలో కోవీడ్‌ సమాచారం గురించి ప్రజల‌ కొరకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కొరకు కలెక్టరేట్‌లో 08462 220183, 08462 223545 రెండు నెంబర్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు.

ప్రజు కరోనా వైరస్‌కు సంబంధించి వారి సమస్యల‌ను ఈ నంబర్లకు ఫోన్‌ ద్వారా తెలుపవచ్చని, వారి వివరాల‌ను నమోదు చేసుకుని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఫోన్లు 24 గంటలు పనిచేస్తాయని ప్రకటనలో కలెక్టర్‌ వివరించారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article