Breaking News

గల్ఫ్‌లో మృతి, బంధువుల‌ ఊరిలో అంత్యక్రియలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌కు చెందిన నలిమెల‌ జెశ్వంత్‌ రెడ్డి (29) ఇటీవల‌ బహరేన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవపేటిక ఆదివారం ఎయిర్‌ ఇండియా విమానంలో బహరేన్‌ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్‌ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

మృతుడు జెశ్వంత్‌ రెడ్డి కుటుంబం నిజామాబాద్‌లో కిరాయి ఇంట్లో ఉంటున్నందున అతని మేనత్త నివసించే ఆర్మూర్‌ మండలం మంథని గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాల‌ని బంధువర్గం నిర్ణయించింది. మృతుని తండ్రి చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో గాయపడి అచేతనంగా ఉండటం వల‌న స్వగ్రామం ఆలూరులోని ఆస్తులు అమ్ముకొని నిజామాబాద్‌లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు.

ఇటీవలే బహరేన్‌కు వెళ్లిన జెశ్వంత్‌ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అతనిపై ఆధారపడ్డ తండ్రి రాంరెడ్డి, తల్లి దివ్య, చెల్లె నిఖిల‌ దిక్కులేని వారయ్యారు. కరోనా ఆంక్షలు, రంజాన్‌ సందర్బంగా కుదించిన పనివేళలు ఉన్నప్పటికీ శ్రమకోర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి బహరేన్‌లోని తెలంగాణ సామాజిక సేవకులు తిర్మన్‌ పల్లి శేఖర్‌, ఎపి ఎన్నార్టి కోఆర్డినేటర్‌ రాయుడు వెంకటేశ్వర్‌ రావు, తెలుగు కళా సమితి అధ్యక్షుడు శివ ఎల్ల‌పు, మురళి నోముల‌ బృందం సహకరించారు.

Check Also

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ ...

Comment on the article