సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 19 సోమవారం జరిగే ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించాల‌ని వారి సమస్యల‌ కొరకు సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల‌ని, తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకూడదని, ఒకవేళ ఇంటి నుండి బయటకు వెళ్లవల‌సి వస్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల‌ని, శానిటైజర్‌ ఉపయోగించాల‌ని ఎట్టి పరిస్థితుల్లో శుభ్రమైన మాస్క్‌లు ధరించడంతో పాటు తిరిగి ఇంటికి వచ్చి చేతులు శుభ్రం చేసుకునే వరకు మాస్క్‌ను తీయవద్దని ఆయన ప్రజల‌కు సూచించారు.

కోవిడ్‌ పరీక్ష కొరకు, వ్యాక్సినేషన్‌ కొరకు వెళ్లేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల‌ని సామాజిక దూరం ఖచ్చితంగా ఉండాల‌ని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరాల‌ నిమిత్తం దుకాణాల‌కు, పనుల‌కు వెళ్ళేవారు కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించినప్పుడే వైరస్‌కు దూరంగా ఉండగలుగుతారు అని కలెక్టర్‌ సూచించారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article