నిబంధనలు తప్పక పాటించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ పాటించాల‌ని 2వ టౌన్‌ నిజామాబాద్‌ పరిధిలోని మార్కెట్‌, ఖిల్లా చౌరస్తా, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని చెప్పారు.

ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని ఎవరికి అయిన ఎలాంటి కరోన ల‌క్షణాలున్నవారు సమీపంలో గల ప్రభుత్వ హాస్పిటల్‌లో చూయించు కోవాల‌ని, డాక్టర్లు తెలిపిన సూచనల‌ను పాటించాల‌ని, కరోన టీకా అందరూ తీసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ డి.సాయినాథ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article